

ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు ఈరోజు వెల్లుట్ల మరియు అన్నసాగర్ గ్రామాలలో ప్రతీ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి ఈ ఆరోగ్య కేంద్రాలు ముఖ్య భూమిక పోషిస్తాయని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాలను సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.
తరువాత వైద్యులతో మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో DMHO, ANM, MLA, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు, వెల్లుట్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, మండల సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.