బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని మున్సిపల్ అధికారులు, పట్టణ వార్డు ఇంచార్జీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు
హైదరాబాద్ బంజారాహిల్స్ తన నివాసం నుండి పోచారం గారు బాన్సువాడ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీ హరి రాజు ,అధికారులు, ప్రజాప్రతినిధులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
టెలికాన్ఫరెన్స్ లో పోచారం గారు మాట్లాడుతూ…
బాన్సువాడ పట్టణ కేంద్రంలో మొదటి విడతగా 260 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి
వార్డుల వారిగా ఏ వార్డుకి ఎన్ని అనేది ఇంచార్జ్ లు అయిన మీకు అన్ని తెలుసు
వార్డు ఇన్చార్జి సభ్యులు ప్రతి ఒక్కరూ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రోత్సహించాలి
ఇల్లు నిర్మాణం కోసం అవసరమయ్యే ఇసుక రాష్ట్రంలోనే మన నియోజకవర్గంలో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేసాము.
నియోజవర్గంలోని బీర్కూర్, కిష్టాపూర్, చించోలి, దామరంచ ఈ నాలుగు క్వారీల నుండి ఇసుక అందుబాటులో ఉంది, ఒక ఇల్లు నిర్మాణానికి సుమారుగా 20 ట్రాక్టర్ల ఇసుక అవసరమవుతుందని అంచనా వేసాం, అందుకు సరిపడా 20 ట్రాక్టర్ల ఇసుకను వారి సొంత స్థలంలో డంపు అయ్యేలా చూడాలి
లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణం స్లాబ్ వరకు పూర్తవుతే నాలుగు లక్షల రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లో జమవుతుందని వారికి అవగాహన కల్పించాలి
బెస్మిట్ లెవెల్ వరకు ఒక లక్ష,స్లాబ్ లెవెల్ వరకు ఒక లక్ష,స్లాబ్ వేశాక రెండు లక్షలు
ఇంటి నిర్మాణం పూర్తి అయితే మిగతా లక్ష మొత్తం 5 లక్షలు విడతల వారిగా చెల్లించడం జరుగుతుంది
స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేవారు L1 కేటగిరీ కిందికి వస్తారు, స్థలం లేని వారు L2 కేటగిరి కిందికి వస్తారు
వార్డు ఇంచార్జి సభ్యులు వార్డులలో తిరుగుతున్నప్పుడు ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలం లేని వారు మీ దగ్గరికి వచ్చి ఇల్లు కావాలి అని అడుగుతే వారి పూర్తి వివరాలు తీసుకొని వారికి ఎమ్మెల్యే గారికి మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వాళ్లకు చెప్పి వారి పూర్తి వివరాలు నాకు తెలియచేయండి
ఇది వరకు బాన్సువాడలో 2500 ఇల్లు (2BHK) నిర్మించి ఇచ్చాం, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ద్వారా స్థలం ఉన్న వారికి 260 ఇల్లు మంజూరు అయ్యాయి, స్థలం లేని L2 కేటగిరి వారి వివరాలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో మంజూరు అయ్యేలా చూస్తాను
నేను రెండు మూడు రోజులలో బాన్సువాడకి వస్తాను మీ పనితీరును పర్యవేక్షిస్తాను
మరోసారి ప్రతి ఒక్క వార్డు ఇంచార్జి విధిగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఇంటి నిర్మాణంపై అవగాహన కల్పించాలని తెలియచేస్తున్నాను.