ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం:
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాంధారి, లింగంపేట మండలాల నుంచి వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు మొత్తం 59 మందికి రూ.16,95,000/- విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులు & కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారి నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఎమ్మెల్యే గారు, చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:
“ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య రంగంలో అండగా నిలబడడం ఎంతో సంతృప్తికరమైన విషయం. ఇప్పటి వరకు అత్యధికంగా CMRF మరియు LOC చెక్కులు పంపిణీ చేయడంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్న విషయాన్ని గర్వంగా చెప్పగలగడం ఆనందంగా ఉంది” అని అన్నారు.
అలాగే, ప్రభుత్వంచే అందే సహాయం ప్రతి ఒక్కరికి సమర్థంగా అందేలా, ప్రత్యేకంగా నియమించబడిన టీమ్ 24/7 పని చేస్తోంది అని వెల్లడించారు. వైద్య అవసరాలకు ఎవరైనా సాయం కావాలంటే, ఎల్లప్పుడూ తన సహాయం అందుబాటులో ఉంటుంది అని హామీ ఇచ్చారు.
“ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సహాయ పథకాలు ఎన్నో కుటుంబాలకు జీవనాధారంగా మారుతున్నాయి. అవసరమైన ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో, సరైన విధంగా సహాయం అందించడమే మా బాధ్యతగా భావిస్తున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు భారీగా పాల్గొన్నారు
Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *