ఎల్లారెడ్డి పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే అవగాహన కార్యక్రమం “ఎల్లారెడ్డి స్వచ్ఛ యాత్ర” ను ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు బస్టాండ్ ప్రాంగణంలో స్వయంగా శుభ్రత కార్యక్రమంలో పాల్గొని, ప్రజలకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. చికెన్ సెంటర్ల వద్ద ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలని వ్యాపారులకు సూచిస్తూ, ఇప్పటికే ప్లాస్టిక్ వాడకం నిలిపిన వ్యాపారులను సన్మానించారు.

తదుపరి ఎమ్మెల్యే గారు (DM) తో మాట్లాడి ఎల్లారెడ్డి బస్టాండ్ పరిసరాల శుభ్రత, శానిటేషన్ కార్యకలాపాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.** అలాగే బస్టాండ్‌లోని మరుగుదొడ్లు శుభ్రంగా నిర్వహించబడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

అతను ప్రయాణికులతో స్వయంగా మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకుని, శుభ్రత పరంగా యెల్లారెడ్డిని ఉత్తమ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజల సహకారం కోరారు.

తరువాత ఎమ్మెల్యే గారు హైవే నిర్మాణం కారణంగా తొలగించబడనున్న శివాజీ మహారాజ్ విగ్రహాన్ని సందర్శించి, ఆ విగ్రహాన్ని తగిన ప్రదేశంలో తిరిగి ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చారు. అలాగే విగ్రహ పరిసరాల్లో రూ.15 లక్షల మున్సిపల్ నిధులతో అందమైన బ్యూటిఫికేషన్ పనులు చేపడతామని, అవసరమైతే తన వ్యక్తిగత నిధులతోనే విగ్రహ పునఃప్రతిష్ఠ పనులు పూర్తి చేస్తానని తెలిపారు.

ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ,

“ఎల్లారెడ్డి మున్సిపాలిటీని దేశంలోనే అత్యంత శుభ్రత కలిగిన పట్టణంగా, ఇండోర్ నగరాన్ని మించి ఇండియాలో నంబర్ 1 స్థానంలో నిలపడం నా కృషి ” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *