స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (Election Commission) సమావేశం నిర్వహించనుంది. CS, DGP, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశం అవుతుంది. అనంతరం సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికల సందడి మొదలు కానుంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో పలుమార్లు మంత్రులు ప్రకటించారు. రేపు ఈసీ సమావేశంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉండి