కామారెడ్డి జిల్లా మమ్మద్ నగర్ (ఓల్డ్ నిజాంసాగర్) మండలం తుంకిపల్లి గ్రామంలో, ప్రజల ఆరోగ్యం దృష్ట ,యువత మద్యానికి బానిస అవుతారని ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా కుటుంబ కలహాలు తలెత్తుతాయని, ఉద్దేశంతో, గ్రామ ప్రజలు , గ్రామ పెద్దలు ,యువకులు, అన్ని పార్టీల నాయకులు సమక్షంలో తీర్మానం చేయడం జరిగింది. గ్రామ కట్టుబాట్లకు విరుద్ధంగా ఎవరైనా మద్యం అమ్మితే (100000)లక్ష రూపాయల జరిమానా విధిస్తామన్నారు, మద్యం అమ్మిన వారి సమాచారం ఇచ్చిన వారికి నజరానా 20000 ఇస్తామని తీర్మానంలో పేర్కొన్నారు , ప్రజల ఆరోగ్యాలు ,సంతోషాలు ముఖ్యమని , ఈ తీర్మానం చేశామని గ్రామ ప్రజలు ఆరోపించారు.