
ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 40వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎల్లారెడ్డి రజక సోదరీ సోదరీమణుల అందరి తరపున ఎల్లారెడ్డి నియోజకవర్గం శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారి తరపున చాకలి ఐలమ్మ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎదురుగ ఉన్నటువంటి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి రజక సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా గారు పాల్గొని చాకలి ఐలమ్మ గారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకొని వారిని గుర్తు చేసుకున్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల మరియు పట్టణ రజక సోదరులు మరియు సోదరిమణులు అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు కార్యక్రమంలో పాల్గొని చాకలి ఐలమ్మ గారి చేసినటువంటి సేవలను వారు గుర్తు చేసుకొని అందరు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎల్లారెడ్డి మండల రజక సోదరులకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది.