కామారెడ్డి జిల్లాలో నుతనంగ ఏర్పాటైనా బిచ్కుంద మున్సిపాలిటికు 15 కోట్లు మంజురైనట్లు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ అప్ప తెలిపారు. విడుదలైనా 15 కోట్లతో మున్సిపాలిటిలో సిసి రోడ్లు, డ్రైనేజితో పాటు మౌలిక సదుపాయాల పనులను చేపట్టనున్నట్లు అయన తెలిపారు.
మున్సిపాలిటికు 15 కోట్లను మంజూరు చేయించిన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మికాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో పిసిసి డెలిగేట్ విట్టాల్ రెడ్డి, బోగాదమిడ సాయిలు, పుల్కల్ వెంకట్ రెడ్డి, దర్పల్ గంగాధర్, నాగనాధ్ పటేల్,గోపాల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు బాలకృష్ణ,సాయిని బస్వరాజ్,నాగరాజ్,పత్తి లింగురం తదితరులు పాల్గొన్నారు.
