ఎల్లారెడ్డి నియోజకవర్గం: లింగంపేట మండలం కొండాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ బుర్ర సందీప్ గౌడ్, కొండాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బట్టు సాయిలు, కొండాపూర్ గ్రామ బిజెపి పార్టీ అధ్యక్షుడు కుమ్మరి రవీందర్, కంచు మహల్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇగ్గడి అశోక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బట్టు సంతోష్, దయ్యాల గంగారం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత పాలకులు 20 సంవత్సరాలుగా చెయ్యని అభివృద్ధి మదన్ అన్న ఎమ్మెల్యే అయిన 18 నెలలో చేసి చుపియడం జరిగింది. 3500 ఇందిరమ్మ ఇల్లు మంజురు చేయడం జరిగింది. గతంలో ఎన్నడు లేని విధంగా 50 కోట్ల నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో బోర్లు వేసి త్రాగు నీటి సమస్య ను తీర్చారు. ముఖ్యంగా లింగంపేట మండలంలో భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చి రైతుల భూ సమస్యలు తీరుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు కుడా మదన్ మోహన్ గారి కృషితో ముందుకు సాగుతున్నాయి. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్ & బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది అని అన్నారు