ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలుతో పాటు పాఠశాల ఆవరణలో మౌలిక సదుపాయాల కల్పనకి కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఉగ్రవాయి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తామని, ఇందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అధికారులు అందరూ కలిసి విద్యార్థులకు సమస్యలు రాకుండా చూడాలని , పాఠశాల ఆవరణలో మౌలిక సదుపాయాలు త్రాగునీరు మూత్రశాలలు మరుగుదొడ్లు విషయంలో సౌకర్యాల కల్పనకి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.