కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగంపేట్ సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సంగమేశ్వర్, కొయ్య గుడ్డు తండా మాజి సర్పంచ్ రాందాస్ నాయక్, ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత పాలకులు 20 సంవత్సరాలుగా చెయ్యని అభివృద్ధి ఎమ్మెల్యే అయిన 18 నెలలో చేసి చేయడం జరిగిందని, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళతో పాటు 50కోట్లతోగ్రామాల్లో సిసి రోడ్లను నిర్మించడం జరిగిందని అయనఅన్నారు.
ఈ కార్యక్రమాలో ex జెడ్పిటి సంతోష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయొద్దీన్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి శ్రీనివాస్ రెడ్డి ex ఎంపీటీసీ ఎదుల్ పార్టీ సీనియర్ నాయకులు గోకుల్ సాయిరాం, సురాయిపల్లి సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి, పోల్కంపేట్ సర్పంచ్ నాగరాజు పాల్గొన్నారు.