కామారెడ్డి జిల్లాలో 5 కోట్లతో నిర్మించిన ఎల్లారెడ్డి బస్టాండ్ ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంబించారు.
అనంతరం మంత్రి పోన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం తో పాటు జిల్లాలోని 10 మండలాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఎల్లారెడ్డి బస్టాండ్ కేంద్ర బిందువుగా ఉంటుందని, నూతనంగా నిర్మించిన ఎల్లారెడ్డి బస్టాండ్ రాబోయే 40 50 సంవత్సరాల పాటు సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా రూపొందించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారులు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.