నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మొండోరా గ్రామంలో లివర్ చెడిపోయి మరణించిన రత్నం కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయాన్ని చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్. చిన్న వయసులోనే ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటు అని ధైర్యంగా ఉండాలని వారి కుటుంబానికి భరోసాను ఇచ్చారు. అనంతరం భీంగల్ మండల కేంద్రానికి చెందిన జలంధర్ ఇటీవల గల్ఫ్ దేశం దుబాయ్లో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. మరియు అనారోగ్యంతో బాధపడుతున్న భీంగల్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు దేశాయ్ కల్పన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ముత్యాల సునీల్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.