కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో వర్షాలు కురవాలని, రైతుల పంటలు పండాలని పదకొండు హనుమాన్ మందిరాలకు పాదయత్రగా వెళ్లి పూజలు చేసేందుకు వెళుతున్న భక్తులకు అల్లాపూర్ గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. అల్లాపూర్ నుండి భక్తులు పదకొండు హనుమాన్ మందిరాలకు మంగళవారం పాదయాత్రగా వెళ్లారు. స్థానిక హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి పదకొండు గ్రామాల్లో పూజలు చేసి మంగళ హారతులు అందుకున్నారు. అల్లాపూర్ కు చెందిన పలువురు దాతలు భక్తులకు పండ్లు, అల్పాహారం అందజేశారు. ఈకార్యక్రమం లో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.