కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలోని విద్యార్థులతో సమావేశమై వారి వసతి గృహాలు, భోజన సదుపాయాలు, పాఠశాల వసతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థుల ఆరోగ్య భద్రతపై, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు ఉన్నా కఠినచర్యలు తీసుకుంటానని, విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
ఈకార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.