ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామానికి చెందిన బైరం జెకోబ్ కూలి పని చేసుకుంటూ జీవిస్తాడు. అంకుల్ క్యాంప్ నందు నివాసం ఉంటున్న ఇతని కుమారుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారం రోజుల క్రితం ఇతను, ఇతని భార్య తమ ఇంటికి తాళం వేసి కుమారుడని చూడటానికి వెళ్లి అక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకు ఇతని ఇంటి తాళాలు పగలగొట్టబడి ఉన్నవి అని ఇతని తమ్ముడు శ్రీనివాస్ తన అన్నకు సమాచారం అందించినాడు. జెకోబ్ మరియు తన కుటుంబ సభ్యులు వచ్చి చూడగా బీరువా తాళాలు పగలగొట్టబడి ఉన్నవి. బీరువాలో ఉంచిన తులం గోల్డ్ చైన్, అద్దతులం ఉంగరం లు కనిపించలేవు అని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ తెలిపినారు.