*ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు మదన్ మోహన్ తో ఎల్లారెడ్డి నియోజకవర్గ పర్యటన*

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, వంతెనలు, రహదారులు, ప్రాజెక్టులను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంలో పర్యటించారు.

సీఎం రేవంత్ రెడ్డి ముందుగా లింగంపేట్ మండలం లింగంపల్లి ఖుర్ధ్ వంతెన (KKY హైవే) ను సందర్శించి, అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేయడం కాకుండా శాశ్వత వంతెన నిర్మాణానికి అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన బుర్గిద్ద నందు రైతు పొలాలను పరిశీలించి, మహిళా రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై రైతుల సమస్యలు విని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.

తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, చెరువులు, వాగుల పరిస్థితిని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మొత్తం పరిస్థితిని సీఎం మరియు మంత్రులకు వివరించారు.

ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, వరదల సమయంలో జిల్లా అధికారుల కృషి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గారు వరదల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల రక్షణకు కావలసిన అన్ని వనరులను అందజేశారని తెలిపారు. 103 సంవత్సరాల చరిత్ర కలిగిన పొచారం ప్రాజెక్టు కూడా కలెక్టర్, SDRF బృందాలు, ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది (ప్రత్యేకంగా RDO & DSP), కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే మదన్ మోహన్ బృందం కృషితో కాపాడబడిందని ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల ప్యాకేజీ మంజూరు చేసి దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, మౌలిక వసతులు పునరుద్ధరించాలని సీఎం గారిని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత 100 ఏళ్లలో ఇంతటి భారీ వర్షాలు, వరదలు ఎప్పుడూ ఎల్లారెడ్డిలో చూడలేదని అన్నారు. *ఈ క్లిష్ట సమయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు రాత్రింబవళ్లు శ్రమించి ప్రజలను రక్షించారని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడారని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి, ఎల్లారెడ్డి నియోజకవర్గం & కామారెడ్డి జిల్లా ప్రభుత్వ అధికారులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు.*

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *