
ఎల్లారెడ్డి పట్టణం రెండవ వార్డ్ లో గౌరవ ఎమ్మెల్యే శ్రీ మదన్మోహన్ గారు 2 వ వార్డ్ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవతో నిధులు తీసుకురావడంతో జరుగుతున్న సీసీ రోడ్డు మరియు సిసి డ్రైన్ పనులు ప్రారంభమైనప్పటికీ, అమృత్ 2.0 పనులు ఆలస్యంగా జరుగుతుండటంతో గత కొంతకాలంగా అభివృద్ధి పనులకు ఆటంకం జరిగింది. ఇట్టి విషయాన్ని మాజీ వార్డ్ సభ్యుడు విద్యాసాగర్ గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ అన్న గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు ఫోన్ లో అధికారులు మరియు కాంట్రాక్టర్ తో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించాలని లేని పక్షం లో CM గారి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించడంతో ఈరోజు ఉదయం మాజీ వార్డ్ సభ్యుడు విద్యాసాగర్ కాంగ్రెస్ నాయకులు పాషా, ఇంతియాజ్, మధు, మరియు కాలనీ వాసుల సమక్షంలో అమృత్ పనులను కాంట్రాక్టర్ ప్రారంభించడం జరిగింది……
ఈ సందర్భంగా కాలనీ వాసులు MLA గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…..