

ఈరోజు లింగంపేట్ మండల కేంద్రంలోని GNR గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నూతన సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు..
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 176 గ్రామాల నుంచి సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిపి 5000 మందికి పైగా భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమ ప్రారంభంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు జ్యోతిని వెలిగించి సభను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ..
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు..
సర్పంచ్ లు అందరూ తమ విధులు పట్ల అవగాహన కలిగి ఉండాలని, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులు పరస్పర సహకారంతో గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు..
సర్పంచ్ ల విధి నిర్వహణలో వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలని, అదేవిధంగా మహిళా సర్పంచ్ ల స్థానంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకుండా, మహిళా సర్పంచ్ లు ముందుండి వారి యొక్క విధులు నిర్వహించాలని చెప్పారు..
గత ప్రభుత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయ్యిందని..
ఇప్పుడు మనం అందరం కలిసి పునర్నిర్మాణం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేదుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు..
ప్రతీ గ్రామంలో రోడ్లు, డ్రైనేజిలు, వీధి దీపాలు,త్రాగు నీరు, ప్రాథమిక ఆరోగ్యం మరియు ఇతర మౌలిక సదుపాయల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుదామని అన్నారు..
ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేయాలి! *నెలకు రెండు సార్లు ప్రభుత్వ పాఠశాలల్లో జీపీ పాలకవర్గం మొత్తం వెళ్లి మధ్యాహ్నం భోజనం చేయాలని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు..
గ్రామాల అభివృద్ధికి సంబంధించి ప్రతీ సర్పంచ్ కు తాను పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు..
నియోజకవర్గంలో ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం తన ఆశయం అని పేర్కొన్నారు..
అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు..
సర్పంచ్ లు హుందాగా వ్యవహారించాలని, పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరినీ కలుపుకొని వెళ్లాలని, గ్రామ అభివృద్ధిలో అందరిని భాగస్వామ్యం చేయాలని చెప్పారు..
గ్రామ అభివృద్దే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందే విధంగా పని చేస్తూ,మంచి పేరు ప్రఖ్యాతులు ఘడిస్తూ, గ్రామ ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోవాలని ఆశా భావం వ్యక్తం చేశారు..
అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు, గౌరవం ఉంటుందని..
కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తూ—
“కాంగ్రెస్ పార్టీ అంటే డిసిప్లిన్… డిసిప్లిన్ అంటే కాంగ్రెస్” అని అన్నారు.
209 గ్రామ పంచాయతీల్లో 176 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగిరిందని, ఇది మాటల విజయం కాదని, ప్రజల తీర్పు, కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 46 సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించామని
ఈ ఫలితాలతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని నిరూపితమైనదని సంతోషం వ్యక్తం చేశారు..
ఇదే ఉత్సాహంతో రాబోయే మున్సిపల్ మరియు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇంతకంటే మంచి ఫలితాలను సాధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా అందించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు..
ఈ కార్యక్రమంలో 8 మండలాల అధ్యక్షులు, AMC చైర్మన్ లు,పార్టీ సీనియర్ నాయకులు, నూతన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..