కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో కురిసిన భారి వర్షానికి బురదమయంగా మారిన జుక్కల్ బస్టాండ్ లో ప్రయాణికులకు ఇబ్బంది కలగడంను గ్రహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు ఆర్టిసి అధికారులతో మాట్లాడి, భారీ వర్షానికి గుంతలుగా మారిన చోట మొరం వేసి చదును చేసి, బస్టాండ్ లో పేరుకు పోయిన చెత్తను సైతం తొలిగించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆర్టిసి అధికారులు జుక్కల్ బస్టాండ్ లో మొరం వేసి, బస్టాండ్ ప్రాంతమంతా చదును చేయించారు. దీంతో వాహనదారుల రాకపోకలకు సౌకర్యవంతంగా మారింది.