తెలంగాణ రాష్ట్రంలో ఇంచార్జు మంత్రులను మార్పు చేసిన రేవంత్ సర్కార్. నల్గొండ జిల్లాకు అడ్లూరి లక్ష్మన్ కుమార్ ను, ఖమ్మం జిల్లాకు వాకిటి శ్రీహరి, మెదక్ జిల్లాకు వివేక్ వెంకట స్వామిను, కరీంనగర్ జిల్లాకు తుమ్మల నాగేశ్వర్ రావును, ఆదిలాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు నియమించారు.
గతంలో నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాకు ఇంచార్జి మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఉమ్మడి నిజామాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా నియమించింది. ఆదిలాబాద్ జిల్లా నుండి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు మంత్రి సితక్కను ఇంచార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.