ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు, ద్వజారోహణము మరియు దత్తాత్రేయని డోలారోహణము, గురుపూజ మరియు అఘోత్తర 128 దీపారాధన మంగళ హారతి మహా నివేదన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దత్త జయంతి కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా అయ్యప్పస్వామి మాలదారులు, ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.