ఓకే సి పువ్వేసి చందమామ ఒక్క జాములాఏ చందమామ…… అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ పండగను, ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగాయి. కళ్యాణి, వెళ్ళుట్ల, తిమ్మారెడ్డి, అన్నాసాగర్, అజామాబాద్, బిక్కనూర్, శివ్వాపూర్, అడవిలింగాల్, లక్ష్మపూర్, రుద్రారం, జంగమయ్యపల్లి, తిమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, మల్కాపూర్, శివ్వానగర్, మాచాపూర్, మల్లయ్యపల్లి సాతెల్లి, సోమార్పేట్, మౌలాన్ ఖేడ్ తో పాటు మిగతా గ్రామాల్లో వైభవంగా నిర్వహించారు. గ్రామాల్లోని కూడళ్లలో బతుకమ్మలను ఉంచి మహిళలు ఆడిపాడారు. అనంతరం గ్రామాల్లోని పొలిమేరలలో ఉన్న బతుకమ్మను నిమజ్జనం చేశారు. వాయినాలు పంచుకొని సల్లంగా చూడు బతుకమ్మ అంటూ ఇంటికి వెనుదిరిగారు.