ఎల్లారెడ్డి : చైనా మంజా కొనుగోలు షాపులపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు…. కేసు నమోదు.
గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాలతో చైనా మాంజాపై దాడులు ఎల్లారెడ్డిలో నిషేధిత మాంజా స్వాధీనం – కేసు నమోదు ఎల్లారెడ్డి: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పట్టణంలో నిషేధిత చైనా మాంజా విక్రయాలపై ఎస్సై బొజ్జ మహేష్ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పట్టణంలోని కొన్ని షాపుల్లో అక్రమంగా విక్రయిస్తున్న ‘చైనా మాంజా (నైలాన్, గ్లాస్ పౌడర్ కలిగిన మాంజా)’ ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన మాంజా విలువ సుమారు రూ. 2,200/- గా అంచనా వేశారు. ఈ సందర్భంగా పోలీసులు చైనా మాంజాను సీజ్ చేసి, పంచనామా నిర్వహించి, నిషేధిత మాంజా విక్రయాలు చేపట్టిన షాపుల యజమానులు పద్మ బాలకృష్ణ ( పన్నాలాల్ కాలనీ), బెస్త మల్లేష్ (కుమ్మరి గల్లీ) ఇద్దరు యజమానులపై BNS సెక్షన్లుతో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించినట్లు ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు. చైనా మాంజా వాడకం వల్ల పక్షులు, ప్రజలకు ప్రాణాపాయం వాటిల్లే ప్రమాదం ఉందని, ముఖ్యంగా పండుగల సమయంలో ఇలాంటి నిషేధిత వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మునుముందు కూడా పట్టణంలో విస్తృత తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.