ఈ రోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఘనవిజయం సాధించిన సందర్భంగా ఎల్లారెడ్డి గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్నగారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయోత్సవాన్ని నిర్వహించారు. ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్‌లు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మరియు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పటాకులు మోగిస్తూ, ఉత్సాహభరితంగా ఈ విజయాన్ని జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో వచ్చిన ఈ విజయంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది నూతన స్పూర్తినిస్తుందని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు