
▪️మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామ్ రెడ్డి
▪️మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ
ఎల్లారెడ్డి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాదె విఠల్ (RMP డాక్టర్ గాదె గంగారం గారి అన్నగారు) మంగళవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గౌడ్ బుధవారం గ్రామానికి చేరుకుని మరణించిన గాదే విఠల్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. అనంతరం బాధలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెబుతూ ఓదార్చారు. గౌరవ ఎమ్మెల్యే మదన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లి, కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు… ఇదే విధంగా మండలంలోని మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన పెద్ది కాంతమ్మ (హనుమంతప్ప గారి సోదరి) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ బుధవారం ఆమె పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఓదార్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వారు చూపిన సానుభూతిని కీర్తించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులున్నారు