కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ.. సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి పోలీసులు (Kamareddy police) అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో అక్కడి పోలీసులకు తెలియకుండా జరుగుతున్న ఈ ముఠా వ్యవహారాన్ని కామారెడ్డి పోలీసులు గుట్టురట్టు చేశారు.
ఈ మేరకు ముఠాకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) శనివారం మీడియాకు వెల్లడించారు. గతనెల 23న మద్యం దుకాణంలో పని చేసే అఖిల్కు ఓ వ్యక్తి రెండు ఫేక్ రూ.500 నోట్లు ఇచ్చి మద్యం తీసుకెళ్లాడు. తర్వాత అవి నకిలీ నోట్లు గుర్తించిన అఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించరు                                                                     

Kamareddy police | రామేశ్వర్​పల్లిలో మొదలైన ఫేక్​ కరెన్సీ బాగోతం..
మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామానికి (Rameshwarpalli village) చెందిన సిద్దాగౌడ్ అనే వ్యక్తి దొంగనోట్లు ఇచ్చి మద్యం తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. అతడిని విచారించగా సులభంగా డబ్బు సంపాదించాలని ఫేస్​బుక్ యాడ్ ద్వారా అందులో ఉన్న నంబరుకు ఫోన్ చేసినట్టుగా వెల్లడించాడు. వెస్ట్ బెంగాల్​కు చెందిన సౌరవ్​డే అనే వ్యక్తి సిద్దాగౌడ్​కు ఫేస్​బుక్​లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అతనికి కాంటాక్ట్ అయ్యాడని, ఫేక్ కరెన్సీ కావాలని అడిగితే రూ.5వేలకు రూ.10వేల నకిలీ నోట్లు పంపుతామని ఒప్పందం కుదుర్చుకున్నాడని చెప్పాడు. 18న కొరియర్ ద్వారా 18 నకిలీ నోట్లు పంపగా అందులో నుంచి రెండు నోట్లు తీసుకెళ్లి మద్యం కొనుగోలు చేసినట్లు తేలింది.

Kamareddy police | 8 ప్రత్యేక బృందాలతో..
ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న ఎస్పీ రాజేష్​ చంద్ర .. ముఠా కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీఎస్ బృందం వెస్ట్ బెంగాల్ (West Bengal) వెళ్లి సౌరవ్​డేను గత నెల 27న పట్టుకుని విచారించగా హరి నారాయణ భగత్ అనే వ్యక్తితో కలిసి నకిలీ నోట్లను బీహార్​కు చెందిన రషీద్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించుకుని కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. సౌరవ్​డే, హరి నారాయణ భగత్​లను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్​కు తరలించారు. అనంతరం బీహార్​కు (Bihar) వెళ్లిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో రషీద్​ను పట్టుకున్నారు. రషీద్ ఎంఎస్సీ చదువుకున్నాడని, అతనికి కలర్, కెమికల్ మిక్సింగ్​పై అవగాహన ఉండటంతో నకిలీ నోట్ల తయారీతో డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Kamareddy police | 15రోజులు.. 8 బృందాలు.. 900కి.మీ..
15 రోజులు 8 బృందాలు 900 కిలోమీటర్ల రెస్క్యూ ఆపరేషన్ చేసిందని ఎస్పీ పేర్కొన్నారు. బీహార్​లో జరిగిన ఆపరేషన్ డేంజర్​గా సాగిందని, కోల్​కతాలో (Kolkata) జనావాసాల మధ్య నిందితులను పట్టుకోవడం కష్టతరంగా మారిందని, యూపీ, మహారాష్ట్రలో డెకాయ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. సెంట్రల్ రైల్వే తమకు పూర్తిగా సహకరించిందని తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందన్నారు. వివిధ రాష్ట్రాల్లో అక్కడి పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని, వాళ్లను తాము కస్టడీకి కోరి విచారణ చేపడతామన్నారు.

నకిలీ నోట్ల సరఫరా రాష్ట్రాల మధ్యనే సాగిందా..? ఇతర దేశాలకు సరఫరా చేశారా అనే ప్రశ్నకు దానిపై దృష్టి పెట్టలేదన్నారు. ఆ విషయం తదుపరి విచారణలో తేలుతుందన్నారు. ముఠాలో 12 మంది ఉన్నారని, అందులో రషీద్, కరెన్సీ కాట్నే, దివాకర్ చౌదరి, సత్యదేవ్ యాదవ్, సౌరవ్ డే, హరి నారాయణ భగత్, సిద్దాగౌడ్, కృతిక రాజ్​లను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించామన్నారు. మరో నలుగురు నందులాల్ జంగ్ డే, చట్టరామ్, పండిత్, శివ శర్మలు పరారీలో ఉన్నారని వారిని సైతం త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *