Kamareddy police | రామేశ్వర్పల్లిలో మొదలైన ఫేక్ కరెన్సీ బాగోతం..
మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామానికి (Rameshwarpalli village) చెందిన సిద్దాగౌడ్ అనే వ్యక్తి దొంగనోట్లు ఇచ్చి మద్యం తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. అతడిని విచారించగా సులభంగా డబ్బు సంపాదించాలని ఫేస్బుక్ యాడ్ ద్వారా అందులో ఉన్న నంబరుకు ఫోన్ చేసినట్టుగా వెల్లడించాడు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సౌరవ్డే అనే వ్యక్తి సిద్దాగౌడ్కు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అతనికి కాంటాక్ట్ అయ్యాడని, ఫేక్ కరెన్సీ కావాలని అడిగితే రూ.5వేలకు రూ.10వేల నకిలీ నోట్లు పంపుతామని ఒప్పందం కుదుర్చుకున్నాడని చెప్పాడు. 18న కొరియర్ ద్వారా 18 నకిలీ నోట్లు పంపగా అందులో నుంచి రెండు నోట్లు తీసుకెళ్లి మద్యం కొనుగోలు చేసినట్లు తేలింది.
Kamareddy police | 8 ప్రత్యేక బృందాలతో..
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ రాజేష్ చంద్ర .. ముఠా కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీఎస్ బృందం వెస్ట్ బెంగాల్ (West Bengal) వెళ్లి సౌరవ్‌డేను గత నెల 27న పట్టుకుని విచారించగా హరి నారాయణ భగత్ అనే వ్యక్తితో కలిసి నకిలీ నోట్లను బీహార్‌కు చెందిన రషీద్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించుకుని కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. సౌరవ్డే, హరి నారాయణ భగత్‌లను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనంతరం బీహార్‌కు (Bihar) వెళ్లిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో రషీద్‌ను పట్టుకున్నారు. రషీద్ ఎంఎస్సీ చదువుకున్నాడని, అతనికి కలర్, కెమికల్ మిక్సింగ్‌పై అవగాహన ఉండటంతో నకిలీ నోట్ల తయారీతో డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
Kamareddy police | 15రోజులు.. 8 బృందాలు.. 900కి.మీ..
15 రోజులు 8 బృందాలు 900 కిలోమీటర్ల రెస్క్యూ ఆపరేషన్ చేసిందని ఎస్పీ పేర్కొన్నారు. బీహార్‌లో జరిగిన ఆపరేషన్ డేంజర్‌గా సాగిందని, కోల్‌కతాలో (Kolkata) జనావాసాల మధ్య నిందితులను పట్టుకోవడం కష్టతరంగా మారిందని, యూపీ, మహారాష్ట్రలో డెకాయ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. సెంట్రల్ రైల్వే తమకు పూర్తిగా సహకరించిందని తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందన్నారు. వివిధ రాష్ట్రాల్లో అక్కడి పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని, వాళ్లను తాము కస్టడీకి కోరి విచారణ చేపడతామన్నారు.
నకిలీ నోట్ల సరఫరా రాష్ట్రాల మధ్యనే సాగిందా..? ఇతర దేశాలకు సరఫరా చేశారా అనే ప్రశ్నకు దానిపై దృష్టి పెట్టలేదన్నారు. ఆ విషయం తదుపరి విచారణలో తేలుతుందన్నారు. ముఠాలో 12 మంది ఉన్నారని, అందులో రషీద్, కరెన్సీ కాట్నే, దివాకర్ చౌదరి, సత్యదేవ్ యాదవ్, సౌరవ్ డే, హరి నారాయణ భగత్, సిద్దాగౌడ్, కృతిక రాజ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో నలుగురు నందులాల్ జంగ్ డే, చట్టరామ్, పండిత్, శివ శర్మలు పరారీలో ఉన్నారని వారిని సైతం త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…
🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి…
హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది…
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్…
మాజీ మంత్రి టి. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరదల కారణంగా రైతులు…
This website uses cookies.