కామారెడ్డి: మంత్రులు ఎమ్మెల్యే తో కలిసి బహిరంగ సభ పరిశీలన.
కామారెడ్డి: రాష్ట్ర మంత్రులతో కలిసి భారీ భహిరంగ సభకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు. ఈనేల 15న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న భారీ భహిరంగ సభకు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి గార్లతో & ఎంపీ సురేష్ షెట్కార్ తో కలిసి స్థల పరిశీలన చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు. ఈ కార్యక్రమంలో మదన్ మోహన్ గారు మాట్లాడుతూ ఈనేల 15న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న భారీ భహిరంగ సభను విజయవంతం చేయాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.BC Declaration | బీసీ డిక్టరేషన్ అమలు సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. ఈనెల 15న కామారెడ్డి పట్టణంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రానికి ఐదుగురు మంత్రుల బృందం చేరుకుంది.