కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు చింతల శంకర్.
తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చింతల శంకర్. క్విట్ ఇండియా ఉద్యమం,స్వతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ మాట్లడుతూ తెలంగాణ తొలి, మలి దశ నికార్సైన ఉద్యమకారుడు, తెలంగాణ బాపూజీ, తెలంగాణకు అసలు సిసలు జాతి పిత మాజీ మంత్రివర్యులు* మాజీ డిప్యూటీ స్పీకర్* *తెలంగాణ కొరకు మొట్ట మొదటి సారి తన MLA పదవికి రాజీనామా చేసిన,మంత్రి పదవిని త్యజించిన త్యాగశీలి, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన శ్రామికుడు తన 96వ యేట రక్తం గడ్డ కట్టె చలిలో ఢిల్లీలో తెలంగాణ కొరకు దీక్ష చేసిన ధీశాలి సహకారోద్యమానికి నాంది పలికిన నాయకుడు ఎన్నో రకాల సామాజిక సంఘాలను స్థాపించిన,బీసీ సంక్షేమ,సహకార సంఘాలకు మార్గనిర్దేశం చేసిన బీసీ కుల బాంధవుడు శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ (తెలంగాణ) బాపూజీ గారికి వారి జయంతి సందర్భంగా బీసీ సంఘాలు,అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది అని అన్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, బీసీ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షులు సబ్బని ధర్మపురి, కృష్ణ హరి,రజక సంఘం జిల్లా అధ్యక్షులు రాజయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా సోషల్ మీడియా ఇంచార్జీ రాజేందర్,బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గౌడ్, బీసీ యూత్ జిల్లా కార్యదర్శి మహేశ్, వివిధ బీసీ కూల సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వివిధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు,కార్యకర్తలు,యువకులు ,తదితరులు పాల్గొన్నారు.