చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి టైటిల్ గ్లింప్స్ విడుదల

ఎమ్౩ మీడియా పతాకంపై మహా మూవీస్ సౌజన్యంతో బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి మరియు నటి సురేఖ వాణీ కూతురు సుప్రీతా నాయుడు హీరో హీరోయిన్ గా మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇది. అయితే ఈ చిత్రం “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” అనే టైటిల్ గ్లింప్స్ ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలియజేస్తూ
నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని మేము లిమిటెడ్ బడ్జెట్ తో ప్రారంభించాము. కానీ మా హీరో హీరోయిన్ కి ఉన్న పాపులారిటీ వల్ల మా చిత్రానికి క్రేజ్ పెరిగింది. అందరికి సుపరిచితం అయినా నటి నటులు రాశి గారు, వినోద్ కుమార్ గారు, సురేఖ వాణి గారు, రాజా రవీంద్ర గారు ఇలా చాలా మంది పాపులర్ నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించాము. షూటింగ్ అంత పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” అనే మంచి టైటిల్ తో త్వరలో మీ ముందుకు వస్తాము” అని తెలిపారు.
హీరోయిన్ సుప్రీతా నాయుడు మాట్లాడుతూ “సినిమా స్టార్టింగ్ టైం లో నాకు భయం వేసింది కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది. మా డైరెక్టర్ కి థాంక్స్ మా హీరో అమరదీప్ కి థాంక్స్, షూటింగ్ టైం లో చాలా సపోర్ట్ చేశారు. మా నిర్మాత నన్ను తన ఇంటి అమ్మాయిలా చూసుకున్నారు. ఈరోజు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసాము. విజువల్స్ చాలా బాగున్నాయి” అని తెలిపారు
నటి సురేఖ వాణి మాట్లాడుతూ “టైటిల్ చాలా బాగుంది. మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. సినిమా చాలా బాగా రావాలి సూపర్ హిట్ కావాలి” అని కోరుకున్నారు.
హీరో అమరదీప్ చౌదరి మాట్లాడుతూ “టైటిల్ చాలా బాగుంది, నా మొదటి సినిమా కి ఇంత మంచి టైటిల్ లో వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా జర్నీ లో మహేంద్ర గారు లాంటి మంచి ప్రొడ్యూసర్ ని నేను ఎక్కడ చూడలేదు. సినిమా ని నమ్మితే ఎంత ఆయన ఖర్చు పెడతారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సినిమా ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు, చక్కగా ప్లాన్ చేసుకుని మంచి సినిమా తో రావాలని అనుకున్నాను, అని కుదరడానికి ఇంత సమయం పట్టింది. “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” మంచి సినిమా. మంచి ప్లానింగ్ తో ఈ సినిమా చేసాము. బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.
చిత్రం పేరు: చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి
నటి నటులు: అమరదీప్ చౌదరి, సుప్రీతా నాయుడు, సురేఖ వాణి, రాజా రవీంద్ర, రాసి, వినోద్ కుమార్, 6 టీన్స్ రోహిత్, ఎస్తర్, రూప లక్ష్మి, గీత సింగ్, ఆకు మాణిక్ రెడ్డి, మహబూబ్ బాషా, జబర్దస్త్ సత్య శ్రీ, తేజ, స్వామి, తదితరులు
బ్యానర్: ఎమ్ 3 మీడియా
అసోసియేషన్ విత్: మహా మూవీస్
సమర్పణ: మహర్షి కూండ్ల
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మాల్యాద్రి రెడ్డి
సంగీతం: కె వి జె దాస్
డి ఓ పి: జి వి అజయ్ కుమార్
డైలాగ్: మరుధూరి రాజా
ఫైట్స్: రాజేష్ లంక
ఎడిటర్: మెనగా శ్రీనివాస్
కోరియోగ్రఫీ: గోవింద్ కోటప్
కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్
మేకప్ చీఫ్: భాను ప్రియా అడ్డగిరి
ఆడియో: శబరి మ్యూజిక్
పిఆర్ఓ: పాల్ పవన్
V59 NEWS

V59 NEWS

Recent Posts

ఎల్లారెడ్డి : ప్రశాంతంగా కొనసాగుతున్న BC బంద్…

స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…

3 days ago

ఇండియన్ ఫార్మా సెక్టర్ సదస్సు లో పాల్గొన్న  పైడి ఎల్లారెడ్డి…

🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో  డా|| పైడి…

6 days ago

కామారెడ్డి : (ఆపరేషన్) అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్…. సాహసం చేసిన పోలీసులు.

కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…

1 week ago

TG : బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా…

హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు  వాయిదా వేసింది…

2 weeks ago

ఎల్లారెడ్డి  : (బీజేపీ) స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం…

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…

2 weeks ago

ఎల్లారెడ్డి :   ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్ ప్రేమ్ కుమార్.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్…

2 weeks ago

This website uses cookies.