జలజీవన్,ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో

ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో సోమవారం నాడు జలజీవన్,ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ వారు వెల్లుట్ల నాయకుల సమక్షంలో కుట్టుమిషిన్ పంపిణీ,ఉచిత కుట్టుమిషిన్ శిక్షణ కార్యక్రమం కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.జలజీవన్ ఉచిత కుట్టుమిషిన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 50%సబ్సిడీ లో కుట్టుమిషన్లు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో జలజీవన్ మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆర్గనైజేషన్ సిఈఓ రవికుమార్ ,డిస్టిక్ కోఆర్డినేటర్ జి. అంజమ్మ మాట్లాడుతూ కుట్టు శిక్షణ పోగ్రామ్స్ లో మహిళలు ఈ కుట్టు శిక్షణ ద్వారా అన్ని రకాల కుట్టు అల్లికలు శిక్షణ అనంతరం మహిళ సాధికర్త పెంపొందే విధానంలో ప్రతి మహిళ ముందు ఉండాలి అని కుట్టు మిషన్ టైనర్ గా వరాలక్షి ని పెట్టడం జరిగిందని తెలియ జేశారు. అదేవిదంగా పటేల్ సాయులు ,కమ్మరి భాస్కర్ మాట్లాడుతూ ఈ కుట్టు మెషిన్ ఉచిత శిక్షణ కార్యక్రమం మారుమూల ప్రాంతమైన మా వెల్లుట్ల గ్రామంలో జలజీవన్ అనే సంస్థ వాలు పెట్టడం శుభనియదాయకం ,ఏంతో ఆనందం ఎందుకంటే గ్రామంలో ఉన్న ఆడపడుచులు దూర ప్రదేశాలకు వెళ్లి నేర్చుకోలేకపోతున్న సమయంలో జలజీవన్ సంస్థ వారు జీవనోపదీ గా ఉపాధి కల్పించారు.కావున మహిళలు అందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని మహిళలు అన్ని రంగలల్లో రాణించాలని కొనియాడారు. డిస్టిక్ కోఆర్డినేటర్ అంజమ్మ మరియు కుట్టుమిషన్ ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలు గ్రామ నాయకులకు శాలువాలు కప్పి పూల బొకేలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పటేల్ సాయులు సొసైటీ చైర్మన్, స్థానిక మాజీ సర్పంచ్ గంట రాజేశ్వరి-సాయులు,కమ్మరి భాస్కర్ మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షుడు.జలజీవన్ డిస్టిక్ కోఆర్డినేటర్ అంజమ్మ ,మహిళ సంఘాల విఓ అధ్యక్షురాలు భాగ్యలక్మి-సాయులు ,జిపి కరోబర్ కృషముర్తి, ట్రైనర్ వరాలక్ష్మీ,పోచవ్వ,హేమలత,కవిత,భార్గవి తదితర మహిళలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *