కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనం వికటించడంతో 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు కాసేపటికే వాంతులు ప్రారంభమవ్వగా, మరికొందరు కడుపునొప్పితో విలవిల్లాడారు. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆర్డిఓ పార్థసింహారెడ్డి పరామర్శించారు. అస్పత్రి వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.