2030 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రామంలోని గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది
ఒక్క ప్రదేశంలోనే 6,680 మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అభినందనీయం.
తెలంగాణ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీని ప్రాధాన్యతా రంగంగా గుర్తించి, 2025 న్యూ ఎనర్జీ పాలసీ అమలులోకి తీసుకువచ్చింది.
• విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది
• తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే లక్ష కోట్ల విలువైన MOUలు గ్రీన్ ఎనర్జీ కోసం చేసింది.
• బొగ్గు ఆధారిత విద్యుత్తు వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు సోలార్, విండ్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ వంటి మార్గాల్లో విద్యుత్తు ఉత్పత్తి.
• విద్యుత్ సరఫరా పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది, జీడీపీ పెరుగుతుంది
భవిష్యత్తు అంతా గ్రీన్ పవర్‌దే. తెలంగాణ రాష్ట్రం దానిని ముందుగానే అర్థం చేసుకుని గ్రీన్ ఎనర్జీలో దేశానికి మార్గదర్శిగా నిలవబోతుంది.