కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ నాలుగో వార్డు వెంకట్ రామ్ నగర్ వడ్డెర కాలనీలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దుంపల శంకర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల కాలంలో ఏనాడు అభివృద్ధికి నోచుకోని వెంకట్రాం నగర్ వడ్డెర కాలనీ నేడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ గెలిచిన ఏడాదిన్నర కాలంలోనే సీసీ రోడ్డులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం శ్రీనివాస్ కంచం సిద్ధిరాములు అంజయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.