
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని వరద బాధితుల పంటల యొక్క నష్టపరిహారాన్ని వెంటనే రైతులకు అందజేసేలా చూడాలని ఎల్లారెడ్డి RDO గారికి , పైడి ఎల్లారెడ్డి గారు (బిజెపి నేత )వినతిపత్రం అందజేయడం జరిగింది, మరియు వ్యవసాయ భూమిలో వరదల వల్ల భారీగా ఇసుక వచ్చి చేరింది. దానిని తొలగించడానికి దానికి గాను మరో 50 వేల రూపాయలు తక్షణ సాయం అందించాలని కోరారు. ఎల్లారెడ్డి నుండి కామారెడ్డికి వెళ్లే రహదారిలో తొందరగా మరమ్మత్తులు పూర్తి చేయాలని , హాస్పటల్ కు , పండగ షాపింగ్ లకు వెళ్లాలంటే చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆఫీసర్లకు కూడా రావడానికి ఇబ్బందిగా ఉందని తెలిపారు రోడ్డు పైన పెద్ద పెద్ద గుంతలు కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.