
గత 15వ తేదీన సోమార్పేట్ గ్రామంలో అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదాన్ని రాజకీయంగా మలచి,
కురుమ సాయిబాబా గారిని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేయడం జరుగుతోంది.
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిపై ట్రాక్టర్‌తో దాడి జరిగింది అని,
ప్రమాదం ఎవరికి జరిగిందో కూడా తెలియకుండా,
ప్రతిపక్ష పార్టీలు కావాలని కాంగ్రెస్ పార్టీపై బురదజల్లుతూ,
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై
లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
అనుకోకుండా జరిగిన ప్రమాదానికి
నాకు సంబంధం ఉందని, నేనే చేయించానని,
ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండానే
చట్టాన్ని చేతిలోకి తీసుకుని
అసత్య ప్రచారం చేయడం
వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.
ఈ ఘటనకు కురుమ సాయిబాబా గారు కారణం అని ప్రచారం చేయడం
పూర్తిగా అబద్ధం, బూటకం, రాజకీయ కక్షతో చేసిన నాటకం మాత్రమే.
ఈ ప్రమాదం పూర్తిగా అనుకోకుండా జరిగిన సంఘటన.
సంబంధిత బాధితులను పోలీసులు ఇప్పటికే
చట్ట ప్రకారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
ఈ విషయం తెలిసినా కూడా
సంబంధం లేని వ్యక్తులను,
మహిళలను కూడా కేసుల్లో ఇరికించేందుకు
ప్రయత్నించడం ఎంతటి దురుద్దేశమో
ప్రజలు గమనించాలి.
🚫 గాయపడిన వారిలో కూడా
మా పార్టీకి ఓటేసినవారే ఉన్నారు.
అలాంటి వారిపై మేమెందుకు అన్యాయం చేస్తాము?
మాకు ఎవరికీ అన్యాయం చేసే ఉద్దేశం లేదు.
📌 గత 30 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది.
ప్రజలకు అన్యాయం చేసి ఉంటే,
ఈ రోజు ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపించేవారా?
ఈ నిజాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు.
🔥 ఎల్లారెడ్డి మండలంలో అత్యధిక స్థానాలు గెలిపించిన ఘనత,
ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు
మదన్ మోహన్ అన్న గారి అడుగుజాడల్లో నడుస్తూ,
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా
కురుమ సాయిబాబా గారికే దక్కింది.
👉 అతి చిన్న వయసులోనే నాయకత్వ అవకాశం రావడం,
👉 ఆ అవకాశం కల్పించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ అన్నగారు,
👉 ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ,
👉 రాబోయే MPTC, ZPTC ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నాడన్న భయంతోనే,
ప్రతిపక్ష పార్టీలు కక్షగట్టి
ఈ కుట్రకు పాల్పడుతున్నాయి.
⚖️ ఈ విషయం ప్రస్తుతం
పోలీసుల న్యాయ విచారణలో ఉంది.
నిజంగా ఏమైనా తప్పు జరిగితే,
చట్టం ముందు నిలబడటానికి మేము సిద్ధమే.
📣 ప్రజలకు మా మనవి:
ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు.
ప్రజల మధ్య నుంచే వచ్చిన,
ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే
ప్రజానాయకుడు – కురుమ సాయిబాబా గారిని లక్ష్యంగా చేసుకుని
చేస్తున్న ఈ రాజకీయ దాడులను ఖండించండి.